మెగాస్టార్ చిరంజీవి నటించిన సెన్సేషనల్ మెగా బడ్జెట్ మూవీ సైరా నరసింహా రెడ్డి బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు వర్షన్ ఊహకందని లెవల్ లో హోల్డ్ చేసి సంచలన కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకు పోతుంది, దాంతో ఇతర భాషల్లో సినిమా సాధించిన నష్టాలను కొద్ది వరకు కవర్ అవుతూ సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ తో ఓవరాల్ గా కొన్ని యూనిక్ రికార్డులను కూడా క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది.
కాగా సినిమా ఓవరాల్ 12 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఓవర్సీస్ లో 2.5 మిలియన్ మార్క్ ని అందుకోగా, నైజాం లో 30 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది, ఇక సీడెడ్ లో 18 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో 100 కోట్ల షేర్ మార్క్ ని.
క్రాస్ చేసి బాహుబలి సిరీస్ తర్వాత దుమ్ము లేపే రికార్డులను నమోదు చేసింది. ఇక సినిమా 12 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి వసూళ్ళ ని సాధించగా సినిమా ఓవరాల్ గా సాధించిన కలెక్షన్స్ 3.2 కోట్ల రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో… అలాగే వరల్డ్ వైడ్ గా…
మినిమమ్ 3.6 కోట్ల రేంజ్ లో ఉండనున్నాయి. దాంతో ఓవరాల్ గా 12 వ రోజు గ్రాస్ 6 కోట్ల రేంజ్ లో ఉండ నుండగా టోటల్ గా 12 రోజుల గ్రాస్ 221 కోట్ల రేంజ్ లో ఉండబోతుంది. రంగస్థలం టోటల్ గ్రాస్ 215 కోట్లకు పైగా ఉండగా ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన సైరా ఇప్పుడు గ్రాస్ పరంగా…బాహుబలి సిరీస్ మరియు సాహో తర్వాత…
ఆల్ టైం 4 వ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సంచలనం సృష్టించింది…ఫైనల్ రన్ లో 250 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతుండగా బ్రేక్ ఈవెన్ కి మాత్రం సినిమా మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. ఇక 12 రోజుల టోటల్ కలెక్షన్స్ కొద్ది సేపట్లో అప్ డేట్ చేస్తాం….