టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండగా సినిమా మూడో వీకెండ్ ఆదివారం రోజున మరోసారి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. మొత్తం మీద 16 రోజుల్లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 171 కోట్ల లోపు గ్రాస్ మార్క్ ని అందుకుంటే వరల్డ్ వైడ్ గా 216 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సాధించింది.
ఇక సినిమా ఇప్పుడు 17వ రోజున తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 2.3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలు బాగుంటే 2.5 కోట్ల దాకా వెళ్ళొచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.9 కోట్ల కి అటూ ఇటూగా గ్రాస్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఈ కలెక్షన్స్ తో సినిమా తెలుగు రాష్ట్రాల్లో 173.5 కోట్ల లోపు గ్రాస్ ను అందుకోబోతుంది. ఇక వరల్డ్ వైడ్ గా 219 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉన్న ఈ సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో ఈస్ట్, వెస్ట్ మరియు గుంటూరు ఏరియాల్లో…
బాలెన్స్ ఉన్న GST రిటర్న్స్ ఈ రోజు యాడ్ కాబోతున్నాయి. వాటితో కలిపి టోటల్ తెలుగు రాష్ట్రాల గ్రాస్ 177 కోట్ల లోపు ఉండే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 223 కోట్లు దాటే అవకాశం ఉంది. టోటల్ గా ఏరియాల వారి 17 రోజుల కలెక్షన్స్ రిపోర్ట్ వచ్చాక డీటైల్ గా అప్ డేట్ చేస్తాం.