Home న్యూస్ 227 రోజుల్లో రికార్డ్…టాలీవుడ్ తరుపున ఇదే రికార్డ్!

227 రోజుల్లో రికార్డ్…టాలీవుడ్ తరుపున ఇదే రికార్డ్!

1184
0

 

 సోషల్ మీడియా లో టాలీవుడ్ హీరోలు చాలా మంది ఎప్పటి నుండో వచ్చి ఉన్నారు, కానీ కొందరు లేట్ గా అకౌంట్స్ ని ఓపెన్ చేశారు, కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం ఇది వరకే ట్విట్టర్ లో అకౌంట్ ఓపెన్ చేసినా కానీ మధ్యలోనే ఆ అకౌంట్ ని ఆపేయగా… మళ్ళీ ఈ ఏడాది తన పుట్టిన రోజు టైం లో తిరిగి ట్విట్టర్ లో రీ ఎంట్రీ ఇచ్చారు….

Tollywood "Top 10" Movies In "Karnataka" State

కాగా రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సూపర్ ఫాస్ట్ గా ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రీసెంట్ గా ట్విట్టర్ లో మొదటి 1 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ని కంప్లీట్ చేసుకున్నారు. ఇందులో పెద్ద విశేషం ఏంటి అనుకుంటున్నారా….

ఈ 1 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకోవడానికి రామ్ చరణ్ కి పట్టిన టైం మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోలకి పట్టిన టైం కన్నా చాలా చాలా తక్కువ అవ్వడం విశేషం, ఎన్టీఆర్ మహేష్ లాంటి స్టార్స్ ట్విట్టర్ లో ఎంట్రీ ఇచ్చి 10 ఏళ్ళు అవుతుండగా ఆ టైం లో ఫాలోవర్స్ లేట్ గా వచ్చారు.

ఇప్పుడు సోషల్ మీడియా బాగా విస్తరించడంతో ఫాలోవర్స్ బాగా పెరిగారు, రామ్ చరణ్ కి 1 మిలియన్ ఫాలోవర్స్ ని క్రాస్ చేయడానికి 227 రోజుల టైం పట్టిందట, టాలీవుడ్ తరుపున ఇది హైయెస్ట్ కాగా తర్వాత అల్లు అర్జున్ కి 588 రోజుల టైం పట్టగా… పవన్ కళ్యాణ్ కి 834 రోజుల టైం పట్టింది.

Nellore Area All Time Top 10 Share Movies

ఇక మహేష్ బాబు కి 1697 రోజుల టైం పట్టగా ఎన్టీఆర్ కి 2837 రోజుల టైం పట్టింది. టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ రికార్డ్ అందుకున్న రామ్ చరణ్ సౌత్ లో కూడా రజినీ తర్వాత సెకెండ్ ఫాస్టెస్ట్ 1 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న యాక్టర్ గా నిలిచారు, ఈ రికార్డ్ ఎంత టైం వరకు ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here