Home న్యూస్ 38 నుండి 22 కోట్ల రేటు….మైండ్ బ్లాంక్….కానీ!!

38 నుండి 22 కోట్ల రేటు….మైండ్ బ్లాంక్….కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి ఈ ఇయర్ సమ్మర్ లో ఆచార్య సినిమా తో బరిలోకి దిగినా ఆ అంచనాలను సినిమా అందుకోలేక పోయిన సినిమా టాలీవుడ్ చరిత్రలోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా నిలిచే రేంజ్ లో నిరాశ పరిచింది. అలాంటి రిజల్ట్ తర్వాత ఆ ఇంపాక్ట్ కొత్త సినిమాల పై ఉండటం ఖాయమని చెప్పాలి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ….

గాడ్ ఫాదర్ సినిమా పై ఆ ఇంపాక్ట్ గట్టిగానే పడింది అని చెప్పాలి. మెగాస్టార్ అండ్ మెగా పవర్ స్టార్ ల కాంబోలో వచ్చిన ఆచార్య సినిమా నైజాం ఏరియాలో 38 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకోగా ఫైనల్ రన్ లో ఆ సినిమా…

12.45 కోట్ల షేర్ ని అందుకుని ఏకంగా 25.55 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని భారీ నష్టాలను సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మెగాస్టార్ అండ్ సల్మాన్ ఖాన్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ బిజినెస్ పై ఇంపాక్ట్ గట్టిగానే పడింది…

ఆల్ రెడీ తెలుగు లో డబ్ అయిన సినిమా రీమేక్ చేయడం, దానికి తోడూ ఆచార్య లాంటి డిసాస్టర్ మూవీ తర్వాత వస్తున్న సినిమా అవ్వడంతో సినిమా కి అనుకున్న రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ రావడం లేదు…. ఇక ఈ సినిమా కి ఇప్పుడు నైజాం ఏరియా లో మొత్తం మీద 22 కోట్ల రేంజ్ లో రేటు ని మాత్రమే సొంతం చేసుకుని….

బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతుంది అని చెప్పాలి. 38 కోట్ల బిజినెస్ నుండి ఏకంగా 16 కోట్ల రేటు తగ్గి ఇప్పుడు 22 కోట్ల రేంజ్ రేటు తో సినిమా బిజినెస్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా ఇప్పుడు పండగ వీకెండ్ లో టాక్ బాగుంటే పండగ వీకెండ్ లోనే టార్గెట్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here