ప్రతీ ఇయర్ చాలానే సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తూ ఉంటాయి, వాటిలో ఎంత క్రేజ్ ఉన్న సినిమా అయినా అప్పుడప్పుడు అంచనాలను అందుకునే విషయంలో విఫలం అవుతూ ఉంటాయి. కొన్ని మాత్రం అంచనాలను అందుకోకపోవడంతో పాటు భారీ ట్రోల్స్ ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి సినిమాల్లో రీసెంట్ గా…
కమల్ హాసన్ (Kamal Haasan)…శింబు(Simbhu) నటించిన తగ్ లైఫ్(Thug Life Movie) మూవీ కూడా ఒకటి…మణిరత్నం లాంటి లెజెండ్రీ డైరెక్టర్ కమల్ హాసన్ తో ఏకంగా 30 ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకుని నాయకుడు సినిమాకి మించిపోయే కథ అంటూ తెరకెక్కించిన తగ్ లైఫ్ మూవీ…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మధ్యనే రిలీజ్ అవ్వగా అసలు ఏమాత్రం ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది..ఓ రేంజ్ లో నెగటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా వీకెండ్ తర్వాత కంప్లీట్ గా వాషౌట్ అయ్యే పరిస్థితి వచ్చింది….దాంతో బాక్స్ ఆఫీస్ రన్ ను త్వరగానే…
కంప్లీట్ చేసుకున్న సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వగా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా కి ఇక్కడైనా డీసెంట్ రిపోర్ట్స్ వస్తాయి అనుకుంటే ఇక్కడ థియేటర్స్ లో రిలీజ్ అయినప్పటి కన్నా కూడా డబుల్ డోస్ లో ట్రోల్స్ పడుతున్నాయి ఇప్పుడు…
ఆల్ మోస్ట్ 230 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన ఈ సినిమా డిజిటల్ రెస్పాన్స్ దారుణంగా ఉంది, అసలు ఏం కథ ఉందని ఈ సినిమా తీశారో…కమల్ హాసన్ కి త్రిషకి మధ్య సీన్స్ కానీ త్రిషకి శింబుకి మధ్య కొన్ని సీన్స్ కానీ ఏమాత్రం ఇంపాక్ట్ ఫుల్ గా లేవని…
కథ ఎటు నుండి ఎటో వెళుతూ సాగిపోయిన ఫీలింగ్ కలిగింది అంటూ..సినిమాలో కొన్ని సీన్స్ మినహా ఓవరాల్ గా మూవీ సహనానికి పరీక్ష పెట్టింది అంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో సినిమా మీద ట్రోల్స్ పడుతున్నాయి…వ్యూవర్ షిప్ కూడా మరీ అనుకున్న రేంజ్ లో లేదని సమాచారం…ఓవరాల్ గా అటు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఇటు డిజిటల్ లో కూడా సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి ఇప్పుడు…