బాక్స్ ఆఫీస్ నంబర్స్ అన్నవి అప్పుడప్పుడు మరీ కామెడీ అయిపోతూ ఉంటాయి…ఈ ఇయర్ మొదట్లో సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ పోస్టర్ ఓ రేంజ్ లో ట్రోల్ స్టఫ్ అయింది….ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు అలాంటిదే కోలివుడ్ మూవీ విషయంలో జరుగుతుంది అని చెప్పాలి ఇప్పుడు….కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన…
సూర్య నటించిన లేటెస్ట్ మూవీ రెట్రో బాక్స్ అఫీస్ దగ్గర మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా వసూళ్ళ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది…మూడో వీకెండ్ లో చాలా చాలా లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
ఇప్పటికీ కూడా 100 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ మార్క్ ని అందుకోలేక పోయింది….ఆల్ మోస్ట్ 100 కోట్ల లోపే సినిమా రన్ ను కంప్లీట్ చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా మరో పక్క మేకర్స్ సినిమా కలెక్షన్స్ పోస్టర్ లో ఏకంగా 235 కోట్ల రేంజ్ లో వసూళ్లు వచ్చాయని పోస్టర్ ను రిలీజ్ చేశారు…
దాంతో 100 కోట్ల మార్క్ నే ఇంకా క్రాస్ అవ్వని సినిమాకి ఎక్కడ నుండి మిగిలిన 135 కోట్లు వచ్చాయి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉండగా..పోస్టర్ లో సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రెవెన్యూ మొత్తం కలిపి 235 కోట్ల మార్క్ ని దాటింది అని…
చిన్న వర్డ్స్ లో చెప్పారు…అది చూసి మరింతగా ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో…ఇలా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రేట్స్ అన్నీ కలిపితే కోలివుడ్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న మొట్ట మొదటి 1000 కోట్ల సినిమా త్వరలోనే…
సొంతం అయ్యే అవకాశం ఉంటుందని ట్రోల్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ విషయంలో కూడా అప్పుడు కోలివుడ్ ఆడియన్స్ గట్టిగానే ట్రోల్స్ వేశారు. ఇప్పుడు అందరూ కలిసి ఇలా కూడా కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తారా అంటూ రెట్రో టీం ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.