Home న్యూస్ 24 గంటల్లో 12 మిలియన్స్ వ్యూస్…చరిత్ర తిరగరాసిన సైరా టీసర్

24 గంటల్లో 12 మిలియన్స్ వ్యూస్…చరిత్ర తిరగరాసిన సైరా టీసర్

1995
0

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి అఫీషియల్ టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో 24 గంటల్లో అఫీషియల్ గా 7.2 మిలియన్ వ్యూస్ ని 2 లక్షల 90 వేల లైక్స్ ని సాధించింది…ఇక సినిమా ఓవరాల్ గా డిజిటల్ వ్యూస్ పరంగా…

తొలి 24 గంటల్లో టోటల్ గా అన్నీ సోషల్ మీడియాలో 12 మిలియన్స్ డిజిటల్ వ్యూస్ ని క్రాస్ చేసినట్లు సమాచారం. దాంతో ఇదివరకు తొలి 24 గంటల్లో అత్యధిక డిజిటల్ వ్యూస్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది ఈ టీసర్.

ఇది వరకు సూపర్ స్టార్ మహేశ్ నటించిన భరత్ అనే నేను టీసర్ 24 గంటల్లో టోటల్ గా 11.5 మిలియన్స్ డిజిటల్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఆ రికార్డ్ ను ఇప్పుడు మెగా ఫ్యాన్స్ 12 మిలియన్స్ తో సైరా కి సరికొత్త రికార్డ్ ను కట్టి పెట్టారు. ఓవరాల్ గా సైరా టీసర్ సంచలన రికార్డులను తొలి 24 గంటల్లో నమోదు చేసింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!