బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ కోలివుడ్ టాప్ హీరోలలో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన కొత్త సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) మూవీ రీసెంట్ గా సమ్మర్ గా ఆడియన్స్ ముందుకు రాగా సినిమాకి మొదటి రోజు మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయినా కూడా అజిత్ కుమార్ స్టార్ డం వలన బాక్స్ ఆఫీస్ దగ్గర…
అంచనాలను మించి కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఓవరాల్ గా లాంగ్ రన్ లో మిక్సుడ్ టాక్ తో కూడా 245 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపింది..ఇక సినిమా రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని డిజిటల్ లో రిలీజ్ అయింది.
నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ఓటిటి లో సినిమాకి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా సినిమా కోర్ పాయింట్ ఫ్యామిలీ కోసం గ్యాంగ్ స్టర్ అయిన హీరో అన్నీ వదిలేసి…
జైలుకి వెళతాడు…కానీ తన కొడుకుకి ప్రాబ్లమ్ రావడం తో తిరిగి గ్యాంగ్ స్టర్ గా మారిన హీరో ఏం చేశాడు అన్నది అసలు కథ…అతి సాదారణమైన కథ పాయింట్ తో తెరకెక్కిన సినిమా హీరో ఎలివేషన్ సీన్స్ బాగున్నా కూడా చాలా వరకు సీన్స్ మరీ ఓవర్ ఎలివేషన్ లాగా అనిపించగా…
చాలా వరకు సీన్స్ రిపీటివ్ గా అనిపించగా ఒక దశ దాటాక బోర్ ఫీల్ అయ్యేలా అనిపించింది అని చెప్పాలి. ఓవరాల్ సినిమా కోలివుడ్ ఆడియన్స్ కి పర్వాలేదు అనిపించేలా ఉండొచ్చు కానీ మన వాళ్ళకి మాత్రం ఇది మరీ ఓవర్ గా అనిపించడం మాత్రం ఖాయమని చెప్పాలి…
అలాగే మెయిన్ కథ పాయింట్ కూడా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది అని చెప్పాలి. జస్ట్ అజిత్ ఫ్యాన్స్ వరకు సినిమా ఎలా ఉన్నా తమ హీరోని ఇలా చాలా వరకు ఎనర్జీ గా చూడటం, వింటేజ్ మూమెంట్స్ ను గుర్తు చేయడం లాంటివి బాగున్నా కూడా…
ఓవరాల్ గా మాత్రం సినిమా బిలో యావరేజ్ స్టఫ్ అనే రేంజ్ లోనే టాక్ ఇప్పుడు డిజిటల్ లో కూడా వినిపిస్తుంది అని చెప్పాలి. మొత్తం మీద టైం పాస్ కోసం అయినా కూడా సినిమా పూర్తి చేయాలి అంటే కొంత ఓపిక ఎక్కువ అవసరం అనే చెప్పాలి..