బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా కుమ్మేసింది…సినిమా మేజర్ కలెక్షన్స్ హిందీలో వీర లెవల్ లో కుమ్మేసినా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా…
ఎక్స్ లెంట్ రన్ ను సొంతం చేసుకుంది కానీ హిందీ జోరు ముందు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ ఎందుకో అండర్ పెర్ఫార్మ్ చేశాయి అనిపించే రేంజ్ లో ఔట్ పెర్ఫార్మ్ చేశాయి. సినిమా సెన్సేషనల్ స్టార్ట్ తర్వాత కలెక్షన్స్ లో కొంచం డ్రాప్స్ కనిపించడంతో…
ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో అందుకోవాల్సిన ఓవరాల్ టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నా కూడా నాలుగో వారంలో కూడా ఎక్స్ లెంట్ షేర్స్ తో రన్ ని కొనసాగించిన సినిమా ఇప్పుడు 24 రోజులు పూర్తి అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో…
ఓవరాల్ గా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ఓవరాల్ గా అందుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు. తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 213 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సినిమా సొంతం చేసుకోగా క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే ఇక్కడ సినిమా 215 కోట్ల రేంజ్ లో షేర్ ని…
సొంతం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడగా 23 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా 214 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 24వ రోజున సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 215 కోట్ల షేర్ మార్క్ ని దాటేసింది….దాంతో ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో..
వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటేసి క్లీన్ హిట్ గా నిలిచింది…ఏరియాల వారిగా చూసుకుంటే మట్టుకు నైజాం, ఈస్ట్ వెస్ట్ లాంటి ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని ఇంకా దాటాల్సి ఉంది…నైజాం లాంగ్ రన్ లో దాటడం ఖాయమని చెప్పాలి కానీ ఈస్ట్ వేస్ట్ లో దాటాలి అంటే మాత్రం ఇంకా జోరు చూపించాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పాలి.