బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చే సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా నుండి రీసెంట్ గా కొత్త సాంగ్ ను రిలీజ్ చేశారు…అమెరికాలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా…
అక్కడ సినిమా నుండి ధోప్ సాంగ్(Dhop Song) ను రిలీజ్ చేయగా…సాంగ్ అంత క్యాచీగా ఏమి లేక పోయినా కూడా రామ్ చరణ్ గ్రేస్ తో వేసిన స్టెప్స్ ఇన్ స్టంట్ గా సోషల్ మీడియాని ఓ రేంజ్ లో పాపులర్ అవుతూ ఉండగా ఆడియన్స్ నుండి రెస్పాన్స్ సాలిడ్ గా వచ్చింది…
లైక్స్ పరంగా అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ఏమి రాక్ పోయినా కూడా వ్యూస్ పరంగా మాత్రం 24 గంటల్లో సాలిడ్ గా కుమ్మేసింది ఈ సాంగ్…..టాలీవుడ్ లో లిరికల్ వీడియోల పరంగా ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది.
అదే టైంలో టాలీవుడ్ లిరికల్ వీడియోల పరంగా 20 మిలియన్స్ కి పైగా వ్యూస్ మార్క్ ని అందుకున్న మూడో సాంగ్ గా కూడా కుమ్మేసింది ఈ సాంగ్…ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి రామ్ చరణ్ గేమ్ చేంజర్ ధోప్ సాంగ్ కి వ్యూస్ పరంగా 21.27 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా…
లైక్స్ పరంగా మాత్రం 233K లైక్స్ ను సొంతం చేసుకుని కనీసం టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయింది. వ్యూస్ పరంగా మాత్రం ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది ఈ పాట. సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ఆడియో సాంగ్స్ అన్నీ కూడా…
ఇనీషియల్ గా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని కుమ్మేశాయి. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ కూడా త్వరలో రిలీజ్ కానున్న నేపధ్యంలో ట్రైలర్ అంచనాలను పెంచే రేంజ్ లో ఉంటే ఇక సంక్రాంతికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.