బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అఖండ(Akhanda) సినిమాకి సీక్వెల్ గా చేస్తున్న అఖండ2-తాండవం(Akhanda2 THANDAAVAM Movie) మూవీ మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా…
ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి అనుకున్న దాని కన్నా కూడా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది…మొదట్లో ఇనీషియల్ రికార్డుల విషయంలో కొంచం స్లో స్టార్ట్ నే సొంతం చేసుకున్నా…
24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఊరమాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ లో సీనియర్ హీరోల సినిమాల టీసర్ ల రికార్డులను అన్నీ బ్రేక్ చేసింది. అదే టైంలో టాప్ టీసర్ రికార్డుల విషయంలో కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను…
సొంతం చేసుకున్న అఖండ2 టీసర్ మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి యూట్యూబ్ లో 22.33 మిలియన్స్ రేంజ్ లో వ్యూస్ మార్క్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఇక లైక్స్ పరంగా కూడా అంచనాలను మించి పోయిన ఈ టీసర్ ఏకంగా 531.5K లైక్స్ మార్క్ ని దాటేసి…
సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇటు వ్యూస్ పరంగా అటు లైక్స్ పరంగా బాలయ్య కెరీర్ లోనే కాదు టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాల టీసర్ లలో ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసిన ఈ టీసర్ ఓవరాల్ గా సినిమా మీద ఇప్పటి వరకు ఉన్న అంచనాలను…
అన్నీ కూడా ఓ రేంజ్ లో మించి పోయింది. టీసర్ కి వచ్చిన రేంజ్ లో రెస్పాన్స్ సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటే కలెక్షన్స్ పరంగా కూడా మాస్ రికార్డులతో దుమ్ము దుమారం లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.