బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో మాస్ మూవీస్ తో మరో రేంజ్ కి వెళతాడు అనుకున్నా కూడా సరైన హిట్స్ ను అందుకోలేక పోయిన ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) ఓపెనింగ్స్ విషయంలో మాత్రం మంచి జోరునే చూపిస్తూ ఉండగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు… ఇప్పుడు ఆడియన్స్ ముందుకు త్వరలో…
ఆంధ్ర కింగ్ తాలుకా(Andhra King Taluka Movie) సినిమాతో సందడి చేయబోతూ ఉండగా రీసెంట్ గా సినిమా టైటిల్ ను కన్ఫాం చేస్తూ అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేశాడు రామ్ పోతినేని…
రామ్ ఎనర్జిటిక్ లుక్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ మరోసారి గ్లిమ్స్ లో హైలెట్ అవ్వగా ఓవరాల్ గా సినిమా మీద అంచనాలను భారీగానే పెంచేసింది అని చెప్పాలి. ఇక 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ గ్లిమ్స్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు…
ఓవరాల్ గా వ్యూస్ పరంగా 24 గంటల్లో ఈ గ్లిమ్స్ కి 11.52 మిలియన్స్ దాకా వ్యూస్ సొంతం అయ్యి ఎక్స్ లెంట్ గా రచ్చ చేయగా…లైక్స్ పరంగా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ గ్లిమ్స్ కి 184K లైక్స్ ని అందుకుని పర్వాలేదు అనిపించుకుంది… ఓవరాల్ గా చూసుకుంటే…
24 గంటల్లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను అయితే ఈ గ్లిమ్స్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక బాక్స్ అఫీస్ దగ్గర ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో వస్తుంది అంటున్న ఈ సినిమా మీద రామ్ కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.