యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) నటించిన లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్(Family Star Movie) ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్సే సొంతం అయ్యింది….
విజయ్ దేవరకొండ న్యూ లుక్, ఫ్యామిలీ ఎలిమెంట్స్….లవ్ సీన్స్ అన్నీ బాగానే ఉండగా సమ్మర్ కి మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అనిపించింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత… దాంతో సమ్మర్ లో సినిమాకి ఏమాత్రం టాక్ బాగున్నా కూడా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపడం ఖాయమని చెప్పొచ్చు…
ఇక ట్రైలర్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో మంచి రెస్పాన్స్ సొంతం అవుతుందని అనుకున్నా కూడా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి షాకింగ్ రెస్పాన్స్ సొంతం అయ్యి అందరికీ మైండ్ బ్లాంక్ చేసిందని చెప్పాలి….మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ ట్రైలర్ కి 3.68 మిలియన్స్ వ్యూస్ మాత్రమె సొంతం అయ్యాయి.
ఇక 24 గంటల్లో లైక్స్ పరంగా 2 లక్షల లైక్స్ మాత్రమే సొంతం చేసుకుంది…విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీ ఖుషి కి 9.82 మిలియన్స్ వ్యూస్ అండ్ 242.5K లైక్స్ అందుకోగా ఆ సినిమాతో పోల్చితే గీత గోవిందం(Geetha Govindam) లాంటి బ్లాక్ బస్టర్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ స్టార్ కి రెస్పాన్స్ మాత్రం…
24 గంటలలో అనుకున్న రేంజ్ లో సొంతం అయితే అవ్వలేదు అనే చెప్పాలి. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు. సినిమాకి మంచి టాక్ కనుక సొంతం అయితే కచ్చితంగా సాలిడ్ ఓపెనింగ్స్ తో కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి ఇప్పుడు.