Home న్యూస్ 24 గంటలు ఓవర్……దుమ్ము లేపిన గేమ్ చేంజర్ ట్రైలర్!!

24 గంటలు ఓవర్……దుమ్ము లేపిన గేమ్ చేంజర్ ట్రైలర్!!

0

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో పక్కా కమర్షియల్ పొలిటికల్ ఎలిమెంట్స్ తో రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు బజ్ కొంచం తక్కువే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు…

సడెన్ గా సినిమా మీద బజ్ ఓ రేంజ్ లో పెరిగిపోయేలా సినిమా అఫీషియల్ ట్రైలర్ మాస్ రచ్చ చేసింది….ట్రైలర్ లో మాస్ ఎలిమెంట్స్, ఎలివేషన్ లు, విజువల్స్ అన్నీ కూడా బాగా ఆకట్టుకోవడంతో ఆడియన్స్ లో మంచి రీచ్ ను ట్రైలర్ సొంతం చేసుకుంది ఇప్పుడు.

ఇక ట్రైలర్ కి యూట్యూబ్ లో ఆడియన్స్ నుండి కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ఇప్పుడు సొంతం అవ్వడం విశేషం. లైక్స్ పరంగా పెద్దగా కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకున్న…

సినిమాల్లో ఒకటిగా మాస్ రచ్చ చేసింది ఈ సినిమా ట్రైలర్… ఓవరాల్ గా 24 గంటల్లో వ్యూస్ ప్రకారం సినిమా ట్రైలర్ 36.24 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యి సాలిడ్ గా ఊచకోత కోసింది ఇప్పుడు. అదే టైంలో లైక్స్ పరంగా పెద్దగా రికార్డులు ఏమి నమోదు అవ్వక పోయినా కూడా….

24 గంటల్లో 541K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి జోరునే చూపించింది ఇప్పుడు… ఓవరాల్ గా వ్యూస్ పరంగా టాలీవుడ్ లోనే ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన గేమ్ చేంజర్ ట్రైలర్ లైక్స్ పరంగా మాత్రం చూసుకుంటే…

టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయింది… లైక్స్ ఎలా ఉన్నా వ్యూస్ కుమ్మేయడం, మంచి రీచ్ ను సొంతం చేసుకోవడం, అన్నింటికీ మించి ఆడియన్స్ లో సినిమా మీద బజ్ బాగానే పెరిగి పోవడంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కచ్చితంగా మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here