Home న్యూస్ 24 గంటలు ఓవర్….కంగువ ట్రైలర్ కి ఊరమాస్ రెస్పాన్స్…కానీ!!

24 గంటలు ఓవర్….కంగువ ట్రైలర్ కి ఊరమాస్ రెస్పాన్స్…కానీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పటి నుండో బిగ్ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన కంగువ(Kanguva Movie) అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా, రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా…

ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. సూర్య టెర్రిఫిక్ గెటప్ కానీ, విజువల్స్ కానీ, గ్రాండియర్ కానీ, దేవి శ్రీ ప్రసాద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కానీ ఓ రేంజ్ లో కుమ్మేశాయి…ముఖ్యంగా టేకింగ్ పరంగా బెస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ తో..

తెరకెక్కిన కంగువ మూవీ ట్రైలర్ పరంగా సాలిడ్ గా జోరు చూపించింది…. సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేసిన కంగువ ట్రైలర్ ఓవరాల్ గా 24 గంటల్లో ఊరమాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు….కానీ తమిళ్ టాప్ స్టార్స్ పరంగా..

24 గంటల్లో కొత్త రికార్డులను నమోదు చేస్తుంది అనుకున్నా కూడా అలా జరగలేదు….అలాగే అన్ని భాషలు కలిపి ఒకే ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఓవరాల్ గా వ్యూస్ అండ్ లైక్స్ లెక్క ఇంకా ఎక్కువగా ఉంటుందని ఎక్స్ పెర్ట్ చేయగా మొత్తం మీద కొత్త రికార్డులు నమోదు చేయకపోయినా కూడా…

24 గంటల్లో కంగువ మూవీ ట్రైలర్ 19.15 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకోగా ఓవరాల్ గా లైక్స్ పరంగా 706K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుంది…ఓవరాల్ గా సూర్య కెరీర్ లో ఇవి బెస్ట్ నంబర్స్ అని చెప్పాలి…ఓవరాల్ గా సినిమా మీద అంచనాలను భారీగా పెంచేసిన…

కంగువ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూర్యకి ఇప్పుడు రికార్డ్ లెవల్ లో ఓపెనింగ్స్ సొంతం అయ్యేలా చేయడం ఖాయమని చెప్పాలి. టాక్ ఏమాత్రం బాగున్నా కూడా కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ గ్రాసింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది ఈ సినిమా కి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here