బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) సినిమా మీద ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలు ఉండగా సినిమాలో ప్రభాస్(Prabhas) స్పెషల్ రోల్ లో నటించడంతో…
ఆ అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. సినిమా ఎప్పుడు వచ్చినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ ఇంపాక్ట్ కచ్చితంగా ఉండటం ఖాయం కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది.
ఎక్కడ ట్రోల్ స్టఫ్ ఏమైనా ఉంటుందో ఏమో అన్న డౌట్ ముందు వచ్చినా కూడా ట్రైలర్ కట్ వరకు డీసెంట్ కట్ తో మంచి విజువల్స్ తో మెప్పించిన కన్నప్ప ట్రైలర్ సినిమా మీద పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలను అయితే పెంచేసింది అని చెప్పాలి.
ఇక సినిమాలో ప్రభాస్ ఇంపాక్ట్ సాలిడ్ గా కనిపించగా అక్షయ్ కుమార్ మరియు మోహన్ లాల్ ల సీన్స్ కూడా పర్వాలేదు అనిపించేలా ఉండగా ఓవరాల్ గా సినిమా పర్వాలేదు అనిపించే రేంజ్ లో మినిమమ్ ఉండటం ఖాయం అనిపించేలా ఉందని చెప్పాలి.
ఇక సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి. మరీ అంచనాలను మించి పోలేదు కానీ ఓవరాల్ గా 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి ఈ ట్రైలర్ కి యూట్యూబ్ లో….
3.98 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 205.3K లైక్స్ మార్క్ ని అందుకుని పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. యాడ్స్ లాంటివి ఏమి వేయకుండా ఉండటంతో జెన్యూన్ ఆడియన్స్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.