Home న్యూస్ 24 గంటలు ఓవర్….కుబేర ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉందంటే!!

24 గంటలు ఓవర్….కుబేర ట్రైలర్ రెస్పాన్స్ ఎలా ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) ల కాంబోలో శేఖర్ కమ్ముల(Shekhar Kammula) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న క్లాస్ మూవీ కుబేర(Kuberaa Movie) సినిమా మీద మంచి అంచనాలు ఉండగా రీసెంట్ గా సినిమా…

అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది. ట్రేడ్ లో కూడా ఎక్స్ పెర్టేషన్స్ పెరగగా ఓపెనింగ్స్ కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

ఇక సినిమా ట్రైలర్ 24 గంటల్లో ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది… వ్యూస్ పరంగా 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి 6.67మిలియన్ వ్యూస్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి జోరుని చూపించిన కుబేర ట్రైలర్ లైక్స్ పరంగా ఓవరాల్ గా 24 గంటలు…

కంప్లీట్ అయ్యే టైంకి 100K లైక్స్ మార్క్ ని అందుకుని పర్వాలేదు అనిపించుకుంది. యాడ్స్ లాంటివి వేయడంతో వ్యూస్ పరంగా మంచి రీచ్ ని సొంతం చేసుకున్న కుబేర ట్రైలర్ లైక్స్ పరంగా ఓకే అనిపించుకునే రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు…

20న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న కుబేర సినిమా మీద తెలుగు తో పాటు తమిళ్ లో మంచి హైప్ నెలకొనగా కలెక్షన్స్ పరంగా మంచి జోరుని ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. చప్పగా సాగుతున్న టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేర ఏ రేంజ్ లో జోరు ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here