Home న్యూస్ 24 గంటలు ఓవర్….రికార్డులు చెల్లాచెదురు చేసిన లైగర్!!

24 గంటలు ఓవర్….రికార్డులు చెల్లాచెదురు చేసిన లైగర్!!

0

యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ ల కాంబినేషన్ లో పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ లైగర్ ఆడియన్స్ ముందుకు వచ్చే నెల ఎండింగ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ట్రేడ్ లో ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి. ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయి అంటే సినిమా అఫీషియల్ ట్రైలర్ ను….

రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ కి తక్కువ వీడియో సాంగ్ కి ఎక్కువగా ఈ ట్రైలర్ ఉందీ అంటూ కామెంట్స్ వినిపించినా కానీ రికార్డులను మాత్రం ఊహకందని రేంజ్ లో క్రియేట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ పరంగా…

బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేసి దుమ్ము దులిపేసింది. మొత్తం మీద 24 గంటల్లో సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 16.80 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి. మీడియం రేంజ్ మూవీస్ పరంగా ఫస్ట్ టైం 15 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని అందుకుని చరిత్ర సృష్టించింది లైగర్ ట్రైలర్…

ఇక లైక్స్ ప్రీవియస్ రికార్డులను భారీ మార్జిన్ తో బ్రేక్ చేసి ఏకంగా 561K మార్క్ ని అందుకుని దుమ్ము దులిపేసింది. ఇది వరకు వ్యూస్ పరంగా ది వారియర్ ట్రైలర్ 24 గంటల్లో 10.53 మిలియన్ మార్క్ ని అందుకుంటే ఆ మార్క్ మీద ఏకంగా 6.3 మిలియన్ లీడ్ తో కొత్త రికార్డ్ ను అందుకుంది. ఇక లైక్స్ పరంగా ఇది వరకు లవ్ స్టొరీ మూవీ ట్రైలర్….

342K మార్క్ ని అందుకుంటే ఏకంగా 219K లీడ్ తో కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. దాంతో పాటే టాలీవుడ్ లో ఓవరాల్ గా ఆల్ టైం హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన ట్రైలర్స్ లో 7 వ ప్లేస్ ను హైయెస్ట్ లైక్స్ ని సాధించిన ట్రైలర్స్ లో 8 ప్లేస్ ను సొంతం చేసుకుని రికార్డులు అన్నీ చెల్లాచెదురు చేసింది లైగర్ ట్రైలర్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here