Home న్యూస్ 24 గంటలు ఓవర్…ఊచకోత కోసిన మహా సముద్రం ట్రైలర్!!

24 గంటలు ఓవర్…ఊచకోత కోసిన మహా సముద్రం ట్రైలర్!!

549
0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అయిన హీరో శర్వానంద్ అలాగే తెలుగు లో స్ట్రైట్ మూవీ చేసి చాలా కాలం అయిన హీరో సిద్దార్థ్ లు కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ మహా సముద్రం…. RX100 డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను…

రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ చేశారు. కాగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి ఈ మధ్య కాలంలో ఏ మీడియం రేంజ్ మూవీ కి కూడా రానంత లెవల్ లో సాలిడ్ పాజిటివ్ బజ్ ఏర్పడింది అని చెప్పాలి. కొంచం ట్రైలర్ కట్ తమిళ్ లో వచ్చిన విక్రమ్ వేదా…

సినిమాను గుర్తు చేసింది అని టాక్ వినిపిస్తుండగా విజువల్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్బుతంగా ఉందటంతో ఈ సినిమాతో శర్వానంద్ బాక్స్ అఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుండగా సిద్దార్థ్ సాలిడ్ రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారు అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ కి మొత్తం మీద…

24 గంటలు కంప్లీట్ అయ్యే టైం కి యూట్యూబ్ లో అప్ డేట్ అయిన వ్యూస్ 5.97 మిలియన్ మార్క్ ని అందుకోగా లైక్స్ పరంగా 173.3K లైక్స్ మార్క్ ని అందుకుంది. లైక్స్ పరంగా మీడియం రేంజ్ హీరోల్లో టాప్ లిస్టు లో చోటు సొంతం చేసుకోకున్నా కానీ వ్యూస్ పరంగా మాత్రం ఓవరాల్ గా టాప్ 5 ప్లేస్ ను ఈ సినిమా ట్రైలర్ దక్కించుకుంది.

👉 #Aranya – 8.32M
👉 #VTheMovie- 7.45M
👉 #TuckJagadish – 7.28M
👉 #Seetimaarr – 6.54M
👉 #MahaSamudram – 5.97M*****
ఇదీ సినిమా ట్రైలర్ సెన్సేషన్… యూట్యూబ్ లో ఎలాంటి యాడ్స్ లాంటివి లేకుండా ట్రైలర్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ లభించింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా దసరా బరిలో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here