Home న్యూస్ 24 గంటలు ఓవర్….మిరాయ్ టీసర్ కి సాలిడ్ రెస్పాన్స్!

24 గంటలు ఓవర్….మిరాయ్ టీసర్ కి సాలిడ్ రెస్పాన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ హనుమాన్ మూవీతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుని టోటల్ రన్ లో ఏకంగా 296 కోట్ల మమ్మోత్ గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించిన యంగ్ హీరో తేజ సజ్జ(Teja Sajja) నటించిన లేటెస్ట్ మూవీ మిరాయ్(Mirai Movie) ఆడియన్స్ ముందుకు ఈ ఇయర్ సెప్టెంబర్ 5న గ్రాండ్ గా…

రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ సినిమా మీద ఉన్న అంచనాలను అన్నింటినీ కూడా ఓ రేంజ్ లో పెరిగేలా చేసింది అని చెప్పాలి. గ్రాండ్ విజువల్స్ ఎక్స్ లెంట్ గ్రాండియర్…టాప్ నాట్చ్ ప్రొడక్షన్ వాల్యూస్ ని..

చాలా తక్కువ బడ్జెట్ లోనే చూపించి మాస్ రచ్చ చేశారు….దాంతో ఒక్కసారి గా సినిమా మీద అంచనాలు పెరిగి పోయాయి. ఇక సినిమా టీసర్ కి తెలుగు లో 24 గంటల్లో ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి.

ఓవరాల్ గా 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి టీసర్ కి యూట్యూబ్ లో 5.54 మిలియన్స్ దాకా వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 24 గంటల్లో 158.6K లైక్స్ మార్క్ ని అందుకుని మంచి జోరుని చూపించింది. తేజ సజ్జ లాంటి యంగ్ హీరోకి ఇది మంచి రెస్పాన్స్ అనే చెప్పాలి.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టీసర్ కి వచ్చిన రేంజ్ లో రెస్పాన్స్ కనుక సొంతం అయితే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమా తేజ సజ్జ మళ్ళీ హనుమాన్ లాంటి విజయాన్ని ఎంతవరకు రిపీట్ చేస్తాడో సెప్టెంబర్లో తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here