Home న్యూస్ 24 గంటలు ఓవర్…పుష్ప2 సెకెండ్ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్!

24 గంటలు ఓవర్…పుష్ప2 సెకెండ్ సాంగ్ కి సాలిడ్ రెస్పాన్స్!

0

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) సినిమా ఈ ఇయర్ వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ముందు నిలిచే సినిమా కాగా ఆడియన్స్ ముందుకు ఆల్ రెడీ సినిమా నుండి మొదటి పాట రిలీజ్ అవ్వగా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా..

ఇప్పుడు సినిమా నుండి రీసెంట్ గా రెండో సాంగ్ అయిన సూసేకి(#SOOSEKI(The Couple Song)#Pushpa2) సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆల్ మోస్ట్ మొదటి పార్ట్ లో ఉన్న నా సామిని పోలినట్లే అనిపించినా ఇక్కడ ట్యూన్ ని మార్చడం, సింగర్ గా శ్రేయా గోషాల్ ను పెట్టడంతో పాట ఈజీగా ఒకసారి వినేలా అనిపించేలా ఉండటంతో…

ఇన్ స్టంట్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది సాంగ్…సినిమా నుండి రెండో సాంగ్ అయినా కూడా తెలుగు లో ఈ సాంగ్ కి మంచి రీచ్ సొంతం అవ్వగా యూట్యూబ్ లో 24 గంటల్లో ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది ఈ సాంగ్…మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి వ్యూస్ పరంగా….

10.75 మిలియన్ వ్యూస్ ను అందుకుని మంచి జోరుని చూపించిన ఈ సాంగ్ లైక్స్ పరంగా 522.2K లైక్స్ మార్క్ ని అందుకుని లైక్స్ పరంగా కూడా మంచి జోరుని చూపించడం విశేషం…అటు వ్యూస్ ఇటు లైక్స్ పరంగా మరీ కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వకపోయినా కూడా ఓవరాల్ గా సాంగ్ కి 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.

ఓవరాల్ గా వ్యూస్ పరంగా టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 6 ప్లేస్ ను అలాగే లైక్స్ పరంగా టాలీవుడ్ లో టాప్ 9 ప్లేస్ ను సొంతం చేసుకుంది ఈ సాంగ్…. ఇక సినిమా నుండి వచ్చే మిగిలిన పాటలకు కూడా ఇదే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఆల్ రెడీ మాసివ్ బజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఇక ఆగస్టులో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో మాస్ రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here