Home న్యూస్ 24 గంటలు ఓవర్….ది రాజా సాబ్ గ్లిమ్స్ కి షాకిచ్చే రెస్పాన్స్!

24 గంటలు ఓవర్….ది రాజా సాబ్ గ్లిమ్స్ కి షాకిచ్చే రెస్పాన్స్!

2

టాప్ స్టార్స్ నటించిన సినిమాల అప్ డేట్స్ వస్తున్నాయి అంటే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పండగ చేసుకుంటూ ఉంటారు….అలాంటిది ఏడాది గ్యాప్ లో మూడు సినిమాలతో రచ్చ చేసి లేటెస్ట్ గా 1000 కోట్ల బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నుండి కల్కి(Kalki 2898 AD movie) లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత…

మారుతి డైరెక్షన్ లో చేస్తున్న లేటెస్ట్ హర్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ అయిన ది రాజా సాబ్(The Raja Saab Movie) వింటేజ్ డార్లింగ్ ప్రభాస్ లుక్స్ ను మరిపించే విధంగా రూపొందుతూ ఉండగా రీసెంట్ గా సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫాం చేస్తూ అఫీషియల్ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు…

దాంతో ఇక సోషల్ మీడియా మొత్తం ఓ రేంజ్ లో రచ్చ లేపడం ఖాయం అనుకున్నారు…యూట్యూబ్ లో రికార్డులతో రచ్చ చేస్తుంది అని కూడా ఎక్స్ పెర్ట్ చేసినా కూడా 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకోవడానికి ఆల్ మోస్ట్ 45 నిమిషాలకు పైగా టైం తీసుకున్న ఈ గ్లిమ్స్..

24 గంటలు పూర్తి అయ్యే టైం కి షాకిచ్చే రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. రీసెంట్ టైంలో స్టార్స్ నటించిన మూవీస్ లో వీకేస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ గ్లిమ్స్ కి యూట్యూబ్ లో…

5.93 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా లైక్స్ పరంగా 24 గంటల్లో 305K~ లైక్స్ ను మాత్రమే సొంతం చేసుకుంది. లైక్స్ పర్వాలేదు అనిపించినా కూడా వ్యూస్ మాత్రం చాలా తక్కువగా సొంతం చేసుకున్న ది రాజా సాబ్ గ్లిమ్స్ అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది…

ప్రభాస్ కల్కి మూవీ కూడా యూట్యూబ్ రికార్డుల విషయంలో పూర్తిగా వెనకబడినా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మాస్ ఊచకోత కోసింది. ది రాజా సాబ్ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది కానీ…..గ్లిమ్స్ విషయంలో ఒక మైనస్ దెబ్బకొట్టింది…

గ్లిమ్స్ ఓవరాల్ గా బాగున్నా కూడా తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో టైటిల్ రివీల్ వీడియోలో ఇచ్చిన స్కోర్ తో పోల్చితే ఏమాత్రం ఇంపాక్ట్ లేని స్కోర్ ని గ్లిమ్స్ కి ఇవ్వడం ఇంపాక్ట్ చూపించింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here