Home న్యూస్ 24 గంటల్లో అల్లకల్లోలం సృష్టించారుగా!!

24 గంటల్లో అల్లకల్లోలం సృష్టించారుగా!!

3655
0

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మొదటి సాంగ్ అయిన ప్రమోషనల్ సాంగ్ దోస్తీకి మేకర్స్ అనుకున్న రేంజ్ రీచ్ దక్కలేదు కానీ రెండో పాటు నాటు నాటు జస్ట్ 15 సెకన్ల ప్రోమోతో అంచనాలను పెంచగా రీసెంట్ గా ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేయగా…

ఇద్దరు హీరోల స్టెప్స్ కి ఫ్యాన్స్ కి పూనకాలు రాగా థియేటర్స్ లో ఈ సాంగ్ కి టాప్ లేచిపోయే రెస్పాన్స్ ఉండటం ఖాయమని చెప్పొచ్చు. సాంగ్ ఎంత మాస్ గా ఉందో ఇద్దరు హీరోల స్టెప్స్, ఒలివియా మోరిస్ లుక్స్ అండ్ ఎక్స్ ప్రెషన్స్ ఆకట్టుకోగా సాంగ్ అంతా ఒకెత్తు…

చివరి 10 సెకన్లు ఇద్దరు హీరోల మాస్ స్టెప్స్ చూస్తుంటే రేపు సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్స్ లో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా పూనకాలతో ఊగిపోవడం ఖాయమని చెప్పాలి. ఇక ఈ సాంగ్ కి ఓవరాల్ గా 24 గంటల్లో సాలిడ్ రెస్పాన్స్ దక్కింది. తెలుగు వర్షన్ 2 ఛానెల్స్ లో…

రిలీజ్ అవ్వగా ఒక ఛానెల్ లో 24 గంటల్లో 7.36 మిలియన్ వ్యూస్ దక్కగా మరో ఛానెల్ లో 3.02 మిలియన్ వ్యూస్ దక్కగా లైక్స్ పరంగా ఒక ఛానెల్ లో 605.5K లైక్స్ దక్కగా మరో ఛానెల్ లో 230K లైక్స్ దక్కాయి. ఓవరాల్ గా రెండు ఛానెల్స్ కలిపి 10.38 మిలియన్ వ్యూస్ ని 835.5K లైక్స్ ని సొంతం చేసుకుని ఫ్యాన్స్ అల్లకల్లోలం సృష్టించారు.

కానీ యూట్యూబ్ రికార్డుల పరంగా ఒక్క ఛానెల్ రికార్డులనే ఇప్పటి వరకు క్యాలిక్యూలేట్ చేస్తారు… ఆ లెక్కన సింగిల్ ఛానెల్ రికార్డ్ పరంగా పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ థీం సాంగ్ 10.20 మిలియన్ వ్యూస్ తో అలాగే భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ 805.5K లైక్స్ తో ఇప్పటికీ టాప్ లోనే ఉంది… ఓవరాల్ గా నాటు నాటు సాంగ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here