Home న్యూస్ 24 గంటలు ఓవర్….రాబిన్ హుడ్ ట్రైలర్ కి ఊరమాస్ రెస్పాన్స్!!

24 గంటలు ఓవర్….రాబిన్ హుడ్ ట్రైలర్ కి ఊరమాస్ రెస్పాన్స్!!

0

ఈ సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న సినిమాల్లో యూత్ స్టార్ నితిన్(Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie) సినిమా ఒకటి కాగా…సాలిడ్ ప్రమోషన్స్ ను జరుపుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా మీద డీసెంట్ అంచనాలు ఏర్పడగా…

ఇప్పుడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా…ట్రైలర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. కొంచం రవితేజ కిక్ సినిమా పోలికలు కొన్ని కనిపించినట్లు అనిపించినా కూడా నితిన్ కెరీర్ లో ఇప్పటి వరకు చేయని..

డిఫెరెంట్ అటెంప్ట్ గా అనిపిస్తున్న రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్ వరకు మంచి మార్కులు కొట్టేసింది. ఇక ట్రైలర్ 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి. టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో..

వన్ ఆఫ్ ది బెస్ట్ అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది రాబిన్ హుడ్ మూవీ ట్రైలర్…ఓవరాల్ గా 24 గంటల్లో వ్యూస్ పరంగా 11.09 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని కుమ్మేసిన ఈ ట్రైలర్ లైక్స్ పరంగా మరీ మాస్ రచ్చ ఏమి చేయలేదు కానీ…

ఉన్నంతలో 209K లైక్స్ మార్క్ ని సొంతం చేసుకుని మంచి రెస్పాన్స్ ను అయితే సొంతం చేసుకుంది. వ్యూస్ పరంగా టాలీవుడ్ లో టైర్2 హీరోల సినిమాల పరంగా ఆల్ టైం టాప్ 6 ప్లేస్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది.

మొత్తం మీద సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఇక సినిమా కూడా ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ట్రైలర్ రేంజ్ లో మెప్పించగలిగితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here