Home న్యూస్ ఇటు 9.24 అటు 256…..మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్!!

ఇటు 9.24 అటు 256…..మాస్ రచ్చ చేసిన నాచురల్ స్టార్!!

0

లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక ఊరమాస్ హిట్, అలాగే ఒక అల్ట్రా క్లాస్ హిట్స్ ను సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) సినిమాతో ఈ నెల ఎండ్ లో మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా…

రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుండి ట్రైలర్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి…ట్రైలర్ లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఓ రేంజ్ లో ఉండటం….అలాగే నాని హీరోయిజం ఎలివేట్ సీన్స్ తో దంచికొట్టడం….

ఎస్ జే సూర్య విలనిజం దుమ్ము లేపడంతో ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది అని చెప్పాలి ఇప్పుడు. ట్రైలర్ మెప్పించినట్లు సినిమా కూడా మెప్పిస్తే టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను…

ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో సైతం ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది అని చెప్పాలి. మరీ కొత్త రికార్డులు ఏమి నమోదు కాలేదు కానీ మొత్తం మీద యూట్యూబ్ లో 24 గంటలు పూర్తి అయ్యే టైంకి…

ఈ ట్రైలర్ కి మొత్తం మీద 9.24 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 256K లైక్స్ సొంతం అయ్యాయి… ఓవరాల్ గా కొత్త రికార్డులు ఏమి నమోదు కాక పోయినా కూడా అనుకున్న టైం కన్నా కూడా ఆలస్యంగా యూట్యూబ్ లో రిలీజ్ అయినా కూడా ఓవరాల్ గా మాత్రం…

ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సూపర్బ్ రెస్పాన్స్ సొంతం అవ్వడమే కాకుండా 24 గంటల్లో సైతం ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం విశేషమనే చెప్పాలి. ఇక సినిమా భారీ అంచనాల నడుమ ఈ నెల ఎండ్ లో రిలీజ్ కానుండగా ఏ రేంజ్ లో ఆడియన్స్ ను మెప్పించి రచ్చ లేపుతుందో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here