Home న్యూస్ 24 గంటలు ఓవర్….సూపర్ స్టార్ రికార్డుల రాంపేజ్!

24 గంటలు ఓవర్….సూపర్ స్టార్ రికార్డుల రాంపేజ్!

1464
0

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట సినిమాలోని టీసర్ బ్లాస్టర్ ను రీసెంట్ గా మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేసినా కొందరు టీసర్ ను ఆన్ లైన్ లో లీక్ చేయడం తో టీసర్ ని ఇక తప్పక సడెన్ గా మిడ్ నైట్ లో ఏమాత్రం నోటిస్ లేకుండా రిలీజ్ చేయాల్సి వచ్చింది. దాంతో స్టార్టింగ్ లో టీసర్ రికార్డుల పరంగా….

చాలా వెనక పడిన సర్కారు వారి పాట టీసర్ బ్లాస్టర్ మొదటి 12 గంటల్లో పెద్దగా రికార్డుల విషయంలో ముందు నిలవలేకపోయింది. ఆ ప్రభావం తర్వాత కూడా కనిపించినా 24 గంటల ఎండ్ టైం లో రికార్డులను అందుకోవడానికి అవకాశం దక్కగా ఈ టీసర్…

లాస్ట్ గంటల్లో జోరు భారీగా చూపెట్టి యూట్యూబ్ లో సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుని టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ను సొంతం చేసుకున్న టీసర్ గా సరికొత్త సంచలన రికార్డులను నమోదు చేసి దుమ్ము దుమారం చేసింది. మొత్తం మీద 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి…

సర్కారు వారి పాట టీసర్ బ్లాస్టర్ 23.06 మిలియన్స్ అప్ డేట్ అయిన వ్యూస్ ని 25.7 మిలియన్స్ రియల్ టైం వ్యూస్ ని సాధించింది. ఇక లైక్స్ పరంగా 24 గంటలు పూర్తీ అయ్యే టైం కి 754.9K లైక్స్ ని సాధించిన ఈ టీసర్ వ్యూస్ పరంగా రికార్డులను సృష్టించినా కానీ లైక్స్ పరంగా మాత్రం ఓవరాల్ గా టాలీవుడ్ లో…

టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని సరిపెట్టుకుంది, వ్యూస్ రికార్డులను అందుకున్న జోరు చూస్తె లైక్స్ కూడా రికార్డ్ కొడుతుందేమో అనుకున్నా లైక్స్ విషయంలో మాత్రం నిరాశ ఎదురు అయింది. ఓవరాల్ గా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ వ్యూస్ రికార్డ్ ని మిడ్ నైట్ సడెన్ రిలీజ్ లో కూడా సొంతం చేసుకోవడం సంచలన రికార్డ్ అనే చెప్పాలి. ప్రాపర్ గా అనుకున్న టైం కి రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బెటర్ రెస్పాన్స్ వచ్చి ఉండేదని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here