బాక్స్ ఆఫీస్ దగ్గర సెప్టెంబర్లో వినాయక చవితి కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న సినిమా స్కంద(Skanda)…ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) బోయపాటి శ్రీను(Boyapati Sreenu) ల కాంబినేషన్ లో భారీ మాస్ మూవీ గా…
రూపొందుతున్న ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు. ట్రైలర్ కి ఆడియన్స్ నుండి రొటీన్ బోయపాటి కమర్షియల్ మాస్ మూవీ లానే అనిపించినా రామ్ కి ఇలాంటి ఊరమాస్ యాక్షన్ మూవీ బాగానే..
సెట్ అయినట్లు అనిపించడంతో ఓవరాల్ గా ట్రైలర్ కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ఆడియన్స్ నుండి సొంతం అయ్యింది. ఇక ట్రైలర్ కి యూట్యూబ్ లో 24 గంటల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యి వ్యూస్ పరంగా టాలీవుడ్ లో…
మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా మాత్రం పెద్దగా జోరు చూపించలేదు. ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ ట్రైలర్ కి 13.20 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 232.4K లైక్స్ మార్క్ ని అందుకుంది…
వ్యూస్ పరంగా మీడియం రేంజ్ మూవీస్ లో లైగర్ మూవీ టాప్ లో ఉంటే ఇప్పుడు స్కంద ట్రైలర్ సెకెండ్ ప్లేస్ లో నిలిచింది. ఓవరాల్ గా ట్రైలర్ 24 గంటల్లో మాస్ రెస్పాన్స్ సొంతం అవ్వడంతో ఇక థియేటర్స్ లో కూడా ఇదే విధంగా రచ్చ చేస్తే భారీ ఓపెనింగ్స్ ఖాయమని చెప్పొచ్చు.