Home న్యూస్ 24 గంటల టార్గెట్….3 గంటల 15 నిమిషాల్లో ఔట్…తర్వాత టార్గెట్ ఇదే!!

24 గంటల టార్గెట్….3 గంటల 15 నిమిషాల్లో ఔట్…తర్వాత టార్గెట్ ఇదే!!

0

సోషల్ మీడియా లో పాత రికార్డుల బెండు తీస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సరికొత్త రికార్డులతో ఊచకోత కోస్తున్నారు… పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెప్టెంబర్ 2 న ఉండగా దానికన్నా ముందు జరిపే అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్ తో పాత రికార్డులు అన్నీ బ్రేక్ చేస్తూ కొత్త రికార్డులు నమోదు చేస్తూ బిగ్గెస్ట్ రికార్డులను నమోదు చేస్తూ సోషల్ మీడియా పై తన ఆధిపత్యం చాలా ఇస్తున్నారు…

రీసెంట్ గా జరిగిన అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే మహేష్ ఫ్యాన్స్ ఇద్దరూ అటూ ఇటూ గా 8.5 మిలియన్ ట్వీట్స్ ని 24 గంటల్లో పోల్ చేశారు. అప్ కమింగ్ అడ్వాన్స్ బర్త్ డే ట్రెండ్స్ కి ఇదే బిగ్గెస్ట్ టార్గెట్ గా మారగా….

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రంగం లోకి దిగి ఫాస్టెస్ట్ 1 మిలియన్ ని 15 నిమిషాల్లోనే అందుకోగా మొదటి గంటకే ఏకంగా 4.12 మిలియన్ ట్వీట్స్ వేసి తమ స్పీడ్ ఎలా ఉందొ చూపెట్టారు. ఇక 24 గంటల టార్గెట్ ని కేవలం 3 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే బ్రేక్ చేసి సంచలన రికార్డ్ ను నమోదు చేశారు.

ఇక ప్రస్తుతానికి ఎంత రీచ్ అయ్యారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఏకంగా 16 మిలియన్ ట్వీట్స్ మార్క్ ని అందుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా లో కూడా బిగ్గెస్ట్ ట్రెండ్ గా నిలిచిన ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ లో పోల్ అయిన 21.5 మిలియన్ ట్వీట్స్ ని బ్రేక్ చేయడమే ధ్యేయంగా దూసుకు పోతున్నారు.

మరి కొన్ని గంటల్లో ఈ రికార్డ్ కూడా బ్రేక్ కాబోతుండగా ఓవరాల్ గా ఇప్పుడు 24 గంటలు పూర్తీ అయ్యే సమయానికి ఆల్ టైం బిగ్గెస్ట్ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆ మార్క్ 25 మిలియన్ అవుతుందా లేక 30 మిలియన్ అవుతుందా అన్నది సాయంత్రం 6 కి తేల బోతుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here