Home న్యూస్ 24 గంటలు ఓవర్….ది రాజా సాబ్ టీసర్ రెస్పాన్స్ ఇదే!!

24 గంటలు ఓవర్….ది రాజా సాబ్ టీసర్ రెస్పాన్స్ ఇదే!!

0

టాప్ స్టార్స్ నటించిన సినిమాల టీసర్ లు వస్తున్నాయి అంటే ఆ టీసర్ లు యూట్యూబ్ లో ఏ రేంజ్ లో రికార్డుల బెండు తీస్తాయో అని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు…లేటెస్ట్ గా పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్(The Raja Saab Movie) సినిమా..

అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా టీసర్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ ను కూడా సొంతం చేసుకుంది…పెద్దగా యాడ్స్ లాంటివి కూడా ఏం వేయకుండానే ఎక్స్ లెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది కానీ ఓవరాల్ గా…

టాలీవుడ్ టాప్ టీసర్ రికార్డుల విషయంలో మాత్రం 24 గంటల పరంగా ఈ టీసర్ వెనకపడే పోయింది అని చెప్పాలి. మొత్తం మీద 24 గంటలు కంప్లీట్ అయ్యే టైంకి ఈ టీసర్ కి యూట్యూబ్ లో 13.84 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 24 గంటల్లో…

577K లైక్స్ మార్క్ ని అందుకుంది…రికార్డుల విషయంలో అటు వ్యూస్ ఇటు లైక్స్ రెండింటిలో కూడా పెద్దగా ఇంపాక్ట్ ని చూపించ లేక పోయిన ఈ సినిమా టీసర్ పెద్దగా యాడ్స్ లాంటివి లేకుండా మంచి ఆర్గానిక్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి…

ఇతర భాషల్లో కూడా రెస్పాన్స్ పర్వాలేదు అనిపించేలా సొంతం చేసుకున్న ఈ టీసర్ ఓవరాల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ లో కామన్ ఆడియన్స్ లో కూడా సినిమా మీద మంచి అంచనాలను అయితే పెంచేసింది అని చెప్పాలి. ఇక సినిమా నుండి వచ్చే ఇతర కంటెంట్ బాగుంటే ఇక డిసెంబర్ లో ప్రభాస్ మాస్ రచ్చ ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here