Home న్యూస్ 24 గంటలు ఓవర్…హైప్ లేని సినిమాతో…మాస్ రచ్చ చేసిన విజయ్!!

24 గంటలు ఓవర్…హైప్ లేని సినిమాతో…మాస్ రచ్చ చేసిన విజయ్!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన రీసెంట్ మూవీస్ తో పోల్చితే విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) మూవీ త్వరలో రిలీజ్ కానుండగా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ ను అంతగా మెప్పించ లేక పోయింది. దాంతో హైప్ విషయంలో విజయ్ రీసెంట్ మూవీస్ లో…

వీకేస్ట్ బజ్ తో ఈ సినిమా రాబోతుందని అందరూ అనుకుంటూ ఉండగా ఇక ట్రైలర్ చివరి హాప్ అనుకోగా సినిమా ట్రైలర్ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చి ఎక్స్ లెంట్ క్వాలిటీతో, అబ్బుర పరిచే విజువల్స్ తో మెప్పించి సినిమా ఉన్న అంచనాలను సాలిడ్ గా పెంచేసింది. విజయ్ డీ ఏజ్ VFX షాట్స్ చాలా వరకు వంక పెట్టడానికి వీలు లేకుండా ఉండగా…

ట్రైలర్ క్వాలిటీ రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఓవరాల్ గా సినిమా మీద ఆడియన్స్ లో నమ్మకాన్ని పెంచింది. ఇక ట్రైలర్ కి యూట్యూబ్ లో కూడా ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా 24 గంటల్లో ఇప్పుడు ఓవరాల్ గా అంచనాలను మించి ఊరమాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. హైప్ లేని సినిమా ట్రైలర్ విషయంలో 24 గంటల్లో సౌత్ మూవీస్ పరంగా…

వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ అండ్ లైన్స్ ను అందుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఓవరాల్ గా 24 గంటలు పూర్తి అయ్యే టైంకి ఈ సినిమా ట్రైలర్ కి 29.28 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా ఈ సినిమా ట్రైలర్ కి 1.236 మిలియన్ లైక్స్ సొంతం అయ్యి ఓవరాల్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…

వ్యూస్ పరంగా ఆల్ టైం సౌత్ బిగ్గెస్ట్ ట్రైలర్ రికార్డుల విషయంలో ఆల్ టైం టాప్ 4 హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకోగా లైక్స్ విషయంలో ఆల్ టైం టాప్ 7 ప్లేస్ ను సౌత్ మూవీస్ లో సొంతం చేసుకుంది. వ్యూస్ అండ్ లైక్స్ రెండూ ఊరమాస్ లెవల్ లో వచ్చి సినిమా మీద అంచనాలను పెంచేయగా ఇక సెప్టెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here