టాప్ స్టార్స్ సినిమాల టీసర్ లు ట్రైలర్ లు వస్తున్నాయి అంటే వాటికి వచ్చే రెస్పాన్స్, సోషల్ మీడియాలో అవి చేసే హడావుడి ఓ రేంజ్ లో ఉంటుంది. లేటెస్ట్ గా టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్(Hrithik Roshan) ల క్రేజీ కాంబోలో భారీ హైప్ నడుమ రూపొందుతున్న వార్2(War2 Movie) సినిమా…
అఫీషియల్ టీసర్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేయగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ వరకు టీసర్ బాగానే ఆకట్టుకున్నా కూడా మిగిలిన ఆడియన్స్ నుండి మాత్రం టీసర్ కి మరీ ఆశించిన రేంజ్ లో అయితే రెస్పాన్స్ సొంతం అవ్వలేదు అనే చెప్పాలి…
ఇప్పుడు 24 గంటలకి గాను టీసర్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఇదే నిజం అనిపించేలా రెస్పాన్స్ సినిమా టీసర్ కి సొంతం అయ్యింది. తెలుగు డబ్ వర్షన్ మెయిన్ ఛానెల్ లో రీసెంట్ టైంలోనే టాప్ స్టార్ మూవీస్ లో వన్ ఆఫ్ ది లోవేస్ట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని షాకిచ్చింది…
మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి వార్2 టీసర్ కి తెలుగు లో 3.15 మిలియన్స్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా లైక్స్ పరంగా 218.1K లైక్స్ మార్క్ ని మాత్రమే సొంతం చేసుకుంది… మరో ఛానెల్ లో 91 వేల లైక్స్ 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయి…
ఇక హిందీ టీసర్ విషయానికి వస్తే 24 గంటల్లో 20.35 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న టీసర్ లైక్స్ పరంగా 679.4K లైక్స్ మార్క్ ని అందుకుని హిందీ వరకు పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ని దక్కించుకుంది…హిందీ నుండి ఎంత డబ్ అయినా కూడా…
ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ వన్ ఆఫ్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న సినిమాకి ఆడియన్స్ నుండి ఇంకా చాలా బెటర్ రెస్పాన్స్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేస్తారని చెప్పాలి. కానీ టీసర్ విషయంలో అది జరగలేదు. ఇక సినిమా ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అయినా మాస్ రచ్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.