బాక్స్ ఆఫీస్ దగ్గర నాలుగో వారంలో కూడా జనాలను థియేటర్స్ కి సాలిడ్ గా రప్పిస్తూ దుమ్ము దుమారం లేపుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) … బ్లాక్ బస్టర్ దేవర(Devara) మూవీకి వారం వారం కొత్త సినిమాలు పోటి వస్తున్నా కూడా ఏవి కూడా జనాలను థియేటర్స్ కి రప్పించ లేక పోతున్నాయి. దాంతో వీకెండ్ లో ఆడియన్స్ కి దేవర మూవీ…
బెస్ట్ ఆప్షన్ గా మారగా వీకెండ్ లో ఇప్పుడు సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లో మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది… 23వ రోజున ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా 24వ రోజు ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో…
మరింత జోరు చూపిస్తూ ఉండగా నైజాం లో కూడా మరోసారి మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు 24వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే… ఆల్ మోస్ట్ 23వ రోజు కన్నా కొంచం బెటర్ గా….
ట్రెండ్ కనిపిస్తూ ఉండగా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 90 లక్షల రేంజ్ నుండి 1 కోటి రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అంచనాలను మించితే షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది..
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 1.2 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు. మొత్తం మీద రిలీజ్ అయిన 24వ రోజు సైతం దేవర మూవీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ దుమ్ము లేపుతూ ఉంది. ఇక టోటల్ గా 24 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.