ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ ని ఉన్నంతలో బాగానే సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా ఆంధ్రలో లాస్ ని గట్టిగానే సొంతం చేసుకోగా నైజాంలో బాగా పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా మిగిలిన రాష్ట్రలలో కూడా ఉన్నంతలో మంచి వసూళ్ళనే సొంతం చేసుకుని పరుగును కొనసాగించింది. సినిమా కి నాలుగో వీకెండ్ లో డిజిటల్ రిలీజ్ అవ్వడం అలాగే…
3rd వేవ్ కూడా స్టార్ట్ అవ్వడం లాంటివి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎదురుదెబ్బ కొట్టగా వీకెండ్ లో కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు, ఇక వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన సినిమా తెలుగు రాష్ట్రాలలో 25 వ రోజు ఆల్ మోస్ట్ 60% వరకు…
డ్రాప్ అయ్యి 8 లక్షల షేర్ ని అందుకోగా 24 రోజుల పాటు హిందీ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా ఫస్ట్ టైం 25 వ రోజు హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుని 1.1 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించింది. దాంతో సినిమా టోటల్ 25 రోజుల కలెక్షన్స్ లెక్క ఈ విధంగా ఉంది.
👉Nizam: 40.52Cr(Without GST 37.24Cr)
👉Ceeded: 14.99Cr
👉UA: 8.03Cr
👉East: 4.87Cr
👉West: 3.94Cr
👉Guntur: 5.08Cr
👉Krishna: 4.22Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 84.73CR(132.15CR~ Gross)
👉Karnataka: 11.46Cr
👉Tamilnadu: 11.15Cr(Corrected)
👉Kerala: 5.42Cr
👉Hindi: 37.90Cr
👉ROI: 2.22Cr
👉OS – 14.36Cr
Total WW: 167.24CR(317CR~ Gross)
ఇదీ మొత్తం మీద 25 రోజుల్లో సినిమా సాధించిన కలెక్షన్స్…
ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 146 కోట్ల టార్గెట్ మీద 21.24 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ నుండి సూపర్ హిట్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. 23-24 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా సినిమా నిలుస్తుంది. ఇక మిగిలిన రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి ప్రదర్శనని చూపెడుతుందో చూడాలి.