అంచనాలను మించి మిక్సుడ్ టాక్ తోనే ఊరమాస్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మాస్ భీభత్సం సృష్టిస్తూ మూడు వారాలను పూర్తి చేసుకోగా, ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడమే కాదు…
ఓవరాల్ గా బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ ను కూడా సొంతం చేసుకుని మాస్ సంచలనం సృష్టించింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 22వ రోజు సాధించిన కలెక్షన్స్ తో మరో బిగ్ మైలురాయిని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు. సినిమా 22వ రోజు మరోసారి…
మంచి హోల్డ్ ని చూపించగా తెలుగు రాష్ట్రాల్లో మాస్ హోల్డ్ ని చూపించగా మిగిలిన చోట్ల పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది. ఓవరాల్ గా సినిమా 22 రోజుల్లో వరల్డ్ వైడ్ గా అక్షరాలా 250 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని అధిగమించి సంచలనం సృష్టించింది…
184 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ, మొదటి రోజు మిక్సుడ్ టాక్ ని తెచ్చుకోవడంతో ఎలాంటి కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుంటుందో అనుకున్నా కూడా ఊహకందని లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న…
దేవర ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ మైల్ స్టోన్స్ ని నమోదు చేసిన దేవర ఇప్పుడు నాలుగో వారంలో కూడా కొత్త సినిమాల నుండి పెద్దగా పోటి ఏమి లేక పోవడంతో వీకెండ్ లో మరోసారి మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో షేర్ ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో చూడాలి.