బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల భీభత్సం చూపిస్తూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa 2 The Rule Movie) సినిమా మొదటి రోజు అన్ని చోట్లా సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ ఊచకోత కోసింది. కలెక్షన్స్ పరంగా ఇప్పుడు సినిమా తొలిరోజు…
ఆల్ టైం రికార్డులను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుండే సినిమా మొదటి రోజు ఇప్పుడు 95-100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సొంతం చేసుకునే అవకాశం ఉండగా…
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అంచనాలను మించిపొతే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక సినిమా హిందీలో మొదటి రోజు డబ్బింగ్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేయబోతుంది. ఏకంగా 80 కోట్లకు పైగానే గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పుడు…
ఇక కర్ణాటకలో సినిమా 14-15 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా తమిళ్-కేరళ ఇతర చోట్ల కలిపి 14-16 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతో తొలిరోజు ఇండియాలో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు 200 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని…
అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఓవర్సీస్ లో సినిమా 7-7.5 మిలియన్ డాలర్స్ రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది ఓవరాల్ గా అటూ ఇటూగా ఇండియన్ కరెన్సీలో…
62-65 కోట్ల రేంజ్ లో ఓవర్సీస్ కలెక్షన్స్ ఉండే అవకాశం ఉండగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు ఇప్పుడు 255-260 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకునే అవకాశం ఉంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఈ మార్క్ ని అందుకుంటే టాలీవుడ్ చరిత్రలోనే కాదు…
ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను ఇప్పుడు పుష్ప2 సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక తొలిరోజు సినిమా బాక్స్ ఆఫీస్ అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఇదే రేంజ్ లో ఉంటాయా లేక కొంచం అటూ ఇటూగా ఉంటాయో చూడాలి ఇప్పుడు.