మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ న అత్యంత భారీ ఎత్తున పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవ్వగా పోటి లో మరో పాన్ ఇండియా మూవీ వార్ కూడా ఉండటం తో సైరా కి నార్త్ లో భారీ ఎదురు దెబ్బ రిలీజ్ కి ముందే తగిలినట్లు అయింది, దానికి తోడూ యూనిట్ అస్సలు హిందీ ప్రమోషన్స్ ని చేయక పోవడం మరింత దెబ్బ కొట్టింది.
ఆ దెబ్బ ఏ రేంజ్ లో ఉందీ అంటే, సినిమాను 25 కోట్ల రేంజ్ లో హిందీ లో అమ్మారు, అమ్మడం అంటే డబ్బులకు అమ్మలేదు కానీ 25 కోట్ల ఒప్పందం తో హిందీ లో ఎక్సెల్ మీడియా ద్వారా సినిమా అక్కడ రిలీజ్ అయ్యింది, సినిమా హిందీ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే…
మినిమమ్ 45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుంటే నే బ్రేక్ ఈవెన్ అవుతుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద మొదటి వారం పూర్తీ అయ్యే సరికి సినిమా అక్కడ 8.6 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుంది, అందులో షేర్ 4.25 కోట్లు వచ్చినట్లు సమచారం.
ఇక హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి సినిమా 10 కోట్ల నెట్ ని 4.98 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది, ఏ లెక్కన చూసుకున్నా సినిమా హిందీ లో అత్యంత భారీ లాస్ ని తెచ్చిన డబ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది. పోటి లో నిలిచిన వార్ కన్నా బెటర్ టాక్ తెచ్చుకున్నా కానీ..
మినిమమ్ ప్రమోషన్స్ కూడా లేక పోవడం తో తీవ్ర ఎదురుదెబ్బ తిన్న సైరా టాక్ బాగున్నా కలెక్షన్స్ లేక హిందీ లో డిసాస్టర్ అనిపించుకుంది. అదే సరిగ్గా 15 – 20 రోజులు అక్కడ విస్తృతంగా సినిమా ను ప్రమోట్ చేసి ఉంటె సినిమా కలెక్షన్స్ వార్ కి ధీటుగా వచ్చి ఉండేవి అంటున్నారు విశ్లేషకులు.