బాక్స్ ఆఫీస్ దగ్గర కరణ్ జోహార్ డైరెక్షన్ లో రణవీర్ సింగ్ – ఆలియా భట్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ (Rocky Aur Rani Kii Prem Kahaani) బాలీవుడ్ లో అద్బుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉంది.
ఆల్ మోస్ట్ 180 కోట్ల మమ్మోత్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కి రివ్యూలు మరీ పాజిటివ్ గా ఇచ్చినా కూడా ఆడియన్స్ నుండి టాక్ యావరేజ్ గానే ఉంది. అయినా కానీ లాస్ట్ మంత్ నుండి పెద్దగా సినిమాలు లేక పోవడంతో ఈ సినిమాని ఎగబడి చూశారు.
అలాగే కరణ్ జోహార్ సినిమాలంటే ఓవర్సీస్ లో భారీ వసూళ్లు రావడం ఖాయం. ఈ సినిమాకి కూడా అది ప్లస్ అయ్యి ఓవర్సీస్ లో ఊరమాస్ వసూళ్లు సొంతం అయ్యాయి. ఇప్పటి వరకు ఇండియాలో ఈ సినిమా 146 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని…
సొంతం చేసుకోగా టోటల్ ఇండియన్ గ్రాస్ 174 కోట్ల దాకా సొంతం చేసుకుంది. అదే టైంలో సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో ఎక్స్ లెంట్ రన్ తో 16.50 మిలియన్ డాలర్స్ ను వసూల్ చేసింది. అంటే ఇండియన్ కరెన్సీలో ఆల్ మోస్ట్ 136 కోట్లకు పైగా గ్రాస్ ను సినిమా సొంతం చేసుకోగా…
టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు ఏకంగా 310 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఇండియా లో టాక్ వలన కలెక్షన్స్ కొంచం తగ్గినా ఓవర్సీస్ కలెక్షన్స్ హెల్ప్ తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయంగా నిలిచింది అని చెప్పాలి.