రెండేళ్ళ క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపిన ఎపిక్ RRR movie తర్వాత జపాన్ లో ఊరమాస్ విజయం అలాగే ఆస్కార్ గెలుపుతో ఇండియన్ సినిమా చరిత్రలో సంచలనాలు ఎన్నో సృష్టించింది…బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ విజయం తర్వాత సినిమా డిజిటల్ లో రిలీజ్ అయ్యింది…
మల్టిపుల్ OTT ప్లాట్ ఫామ్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమాకి అన్ని చోట్లా సెన్సేషనల్ వ్యూవర్ షిప్ సొంతం అవ్వగా అన్నింటికీ మించి నెట్ ఫ్లిక్స్ లో మాత్రం మరో లెవల్ లో రీచ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ చరిత్రలో ఇండియన్ మూవీస్ పరంగా రేర్ రికార్డ్ ను నమోదు చేసింది ఇప్పుడు….
సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూగా ఎక్కువ వారాలు ట్రెండ్ లో ఉన్న మూవీస్ లో రేర్ రికార్డ్ ను RRR మూవీ సొంతం చేసుకుందని సమాచారం…నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన తర్వాత కంటిన్యూగా 25 వారాల పాటు ఈ సినిమా టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించిందట.
బాలీవుడ్ లో సూర్యవంశీ మూవీ 20 వారాల పాటు టాప్ ట్రెండ్స్ లో నిలవగా RRR రికార్డ్ ను బ్రేక్ చేస్తుంది అనుకున్నా అది బ్రేక్ చేయలేక పోయింది..కానీ RRR మూవీ మాత్రం అక్షరాలా 25 వారాల పాటు నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ అయ్యి వరల్డ్ వైడ్ సినీ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకుని మాస్ రచ్చ చేయడం విశేషం అని చెప్పాలి.