బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 4 వ వారంలో కూడా లిమిటెడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును డీసెంట్ గానే కొనసాగిస్తూ వస్తుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప, సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అవ్వడం అలాగే 3rd వేవ్ స్టార్ట్ అవ్వడం లాంటివి సినిమా కలెక్షన్స్ పై ఇంపాక్ట్ ని అయితే చూపుతున్నాయి అనడం లో ఎలాంటి సందేహం లేదు…
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 26 వ రోజు 25 వ రోజుతో పోల్చితే ఆల్ మోస్ట్ 2 లక్షల దాకా డ్రాప్ అయ్యి 6 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక హిందీ లో కూడా డిజిటల్ రిలీజ్ కాబోతూ ఉండటం కొన్ని చోట్ల థియేటర్స్ మూత పడటం లాంటివి…
ఇంపాక్ట్ చూపి అక్కడ కూడా కలెక్షన్స్ స్లో అయ్యేలా చేశాయి, దాంతో ఓవరాల్ గా కలెక్షన్స్ ఇది వరకటితో పోల్చితే వర్కింగ్ డేస్ లో ఇంకా డ్రాప్ అవుతున్నాయి కానీ సినిమా ఇప్పటికే సాలిడ్ గా సెన్సేషన్ ని క్రియేట్ చేసి 318.5 కోట్ల గ్రాస్ ను 26 రోజుల్లో అందుకుంది.
ఇక సినిమా 26 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 40.54Cr(Without GST 37.24Cr)
👉Ceeded: 15.00Cr
👉UA: 8.04Cr
👉East: 4.87Cr
👉West: 3.94Cr
👉Guntur: 5.09Cr
👉Krishna: 4.23Cr
👉Nellore: 3.08Cr
AP-TG Total:- 84.79CR(132.25CR~ Gross)
👉Karnataka: 11.48Cr
👉Tamilnadu: 11.17Cr
👉Kerala: 5.44Cr
👉Hindi: 38.35Cr
👉ROI: 2.22Cr
👉OS – 14.40Cr
Total WW: 167.85CR(318.50CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ గా 26 రోజుల కలెక్షన్స్…
సినిమా ను మొత్తం మీద 144.9 కోట్ల రేంజ్ రేటు కి అమ్మగా 146 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొత్తం మీద సినిమా 26 రోజులు పూర్తీ అయ్యే టైం కి 21.85 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపుతూ సంక్రాంతి సెలవుల్లో జోరు చూపే అవకాశం ఉందనిపిస్తుంది. థియేటర్స్ కూడా దొరికే అవకాశం ఉండటంతో కలెక్షన్స్ జోరు కొనసాగవచ్చు.