Home న్యూస్ ఇంకా 26 రోజులు ఉంది…ఆల్ రెడీ అక్కడ షోస్ హౌస్ ఫుల్!

ఇంకా 26 రోజులు ఉంది…ఆల్ రెడీ అక్కడ షోస్ హౌస్ ఫుల్!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా రిలీజ్ ఇంకా 26 రోజుల టైం ఉంది. ఆల్ రెడీ సినిమా మీద రోజు రోజుకి బజ్ అయితే పెరిగి పోతూ ఉండగా…

రీసెంట్ సినిమా నుండి వచ్చిన యానిమేసన్ సిరీస్ కి ఆడియన్స్ నుండి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ అయితే సొంతం అయ్యింది. దాంతో అంచనాలు ఇంకా పెరిగి పోగా ఇంకా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉండగా సినిమా ఓవర్సీస్ లో సెలెక్టివ్ ఏరియాలలో టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ చేశారు….

అమెరికాలో సినిమా డల్లాస్ ఏరియాలో సినిమా ప్రీమియర్స్ షోల బుకింగ్స్ ను మెల్లిమెల్లిగా ఓపెన్ చేస్తూ ఉండగా అక్కడ బుకింగ్స్ యమ జోరుగా సాగుతూ ఓపెన్ చేసిన స్క్రీన్స్ లో బుకింగ్స్ అన్నీ ఫుల్ అయిపోయాయట… సినిమా ఫుల్ బుకింగ్స్ అన్నీ కూడా జూన్ 8 తర్వాత ఓపెన్ కాబోతున్నట్లు సమాచారం….

మొత్తం మీద సినిమా కొంత గ్యాప్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సినిమా కాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉండగా ఇక ట్రైలర్ కూడా క్లిక్ అయితే సినిమా మీద బజ్ మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇక కల్కి మ్యానియా ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here