బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో నాలుగో వీకెండ్ ని పూర్తి చేసుకున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ నాలుగో వారం వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా సినిమా మిగిలిన కొత్త సినిమాలతో పోల్చితే ఇప్పటికీ బెటర్ గానే హోల్డ్ చేయగా…
కొత్త సినిమాలు అన్నీ కూడా కంప్లీట్ గా చేతులు ఎత్తేశాయి. ఇక వర్కింగ్ డే ఇంపాక్ట్ వలన కల్కి మూవీ 26వ రోజున డ్రాప్స్ ను ఎక్కుగానే సొంతం చేసుకోగా సండేతో పోల్చితే…ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 75% రేంజ్ లో డ్రాప్స్ అయితే ఉన్నాయి అని చెప్పాలి..
దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 26వ రోజున అటూ ఇటూగా 30-35 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక హిందీలో 1.25-1.4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉండగా మిగిలిన చోట్ల అలాగే….
ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ ఉండగా అన్ని చోట్లా కలుపుకుని సినిమా 26వ రోజు వరల్డ్ వైడ్ గా 1.3-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.
ఓవరాల్ గా సినిమా నాలుగో వీకెండ్ లో దుమ్ము లేపిన తర్వాత ఇక వర్కింగ్ డేస్ లో స్లో డౌన్ అయింది. అయినా కూడా ఇప్పటికే సినిమా సాలిడ్ గా రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రాంపెజ్ ను చూపించింది. ఇక టోటల్ గా సినిమా 26 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక.