బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) రిమార్కబుల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు నాలుగో వీకెండ్ లో దుమ్ము లేపే రేంజ్ లో మరోసారి హోల్డ్ ని చూపించగా…
26వ రోజు నుండి సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వగా ఉన్నంతలో సినిమా హోల్డ్ సాలిడ్ గానే కొనసాగుతున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా తెలుగు రాష్ట్రాల్లో కోటికి తగ్గకుండా షేర్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము దుమారం లేపిన సినిమా…
ఇప్పుడు నాన్ స్టాప్ రికార్డ్ స్ట్రీక్ కి బ్రేక్ పడబోతుంది….ఆల్ మోస్ట్ సండే తో పోల్చితే మండే కి వచ్చేసరి ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో 60% రేంజ్ లో డ్రాప్స్ అన్ని చోట్లా కనిపిస్తూ ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఈ ట్రెండ్ కనిపిస్తున్న నేపధ్యంలో…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఈ రోజు 65-80 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ 85-90 లక్షల రేంజ్ కి వెళ్ళొచ్చు… కోటి మార్క్ ని అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో…
సినిమా 20 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా హిందీ విషయానికి వస్తే అక్కడ ఈ రోజు డ్రాప్స్ ఉండగా 4 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని కొంచం అటూ ఇటూగా సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా…
మొత్తం మీద వరల్డ్ వైడ్ గా 26వ రోజున ఇప్పుడు 3.2-3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది ఇప్పుడు, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ మరికాస్త పెరిగే అవకాశం ఉంది. ఇక మొత్తం మీద నాన్ స్టాప్ రికార్డుల జాతరకి ఎట్టకేలకు ఇప్పుడు బ్రేక్ పడబోతుంది. ఇక టోటల్ గా 26 రోజుల్లో సినిమా సాధించే కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.