మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ తుడరుం(Thudarum Movie) బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ నాలుగో వారంలో కూడా స్టడీ వసూళ్ళని అందుకుంటూ ఉండగా…సినిమా ఆల్ రెడీ కేరళ లో ఇండస్ట్రీ రికార్డుల బెండు తీసి చరిత్రలో మొట్ట మొదటి సారిగా…
100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించగా ఇప్పుడు మరో రికార్డ్ ను కూడా అక్కడ నమోదు చేసి సంచలనం సృష్టించింది. సినిమా రిలీజ్ అయిన రోజు నుండి ఆల్ మోస్ట్ 27 రోజుల పాటు నాన్ స్టాప్ గా ఇప్పుడు ప్రతీ రోజూ అక్కడ…
కోటికి తగ్గకుండా గ్రాస్ మార్క్ ని అందుకుని సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇది వరకు అక్కడ 2018 మూవీ అలాగే ఆవేశం సినిమాలు నాన్ స్టాప్ గా 26 రోజుల పాటు కోటికి తగ్గకుండా గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఆ రికార్డ్ ను బ్రేక్ చేసిన తుడరుం మూవీ 27 రోజులతో రచ్చ లేపగా…
28వ రోజు కూడా మరోసారి ఈ మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉండటంతో మళ్ళీ వీకెండ్ లో కూడా రచ్చ లేపే అవకాశం ఉన్న సినిమా సెన్సేషనల్ రన్ తో అనేక రికార్డులను నమోదు చేస్తూ ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు 27 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Thudarum Movie Movie 27 Days Total WW Collections Report
👉Kerala – 112.90CR~
👉Telugu States – 3.75Cr~
👉Karnataka – 8.55Cr~
👉Tamil+ROI – 9.10Cr
👉Overseas – 92.80CR ***Approx
Total WW Collections – 227.10CR(111.75CR~ Share)
మొత్తం మీద 46 కోట్ల టార్గెట్ మీద సినిమా 65.75 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది….ఇక మిగిలిన రన్ లో సినిమా లాభాలను మరింతగా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.