బాక్స్ ఆఫీస్ దగ్గర ఊరమాస్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా నాలుగో వీక్ ని ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతుంది. ఈ వీక్ లో కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా సంక్రాంతికి వస్తున్నాం మూవీ…
మాస్ జాతర మాత్రం తగ్గలేదు, అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 27వ రోజున సండే అడ్వాంటేజ్ లభించడంతో మరోసారి ఎక్స్ లెంట్ ట్రెండ్ ను పోటిలో కూడా చూపెడుతూ దూసుకు పోతుంది. సినిమా 27వ రోజున తెలుగు రాష్ట్రాల్లో…
26వ రోజు మీద బెటర్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 65-70 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపించే లా ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా ఓవరాల్ గా 80 లక్షల రేంజ్ నుండి ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే 85 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు.
ఓవరాల్ గా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న సినిమా లాభాలను సూపర్ సాలిడ్ గా పెంచుకుంటూ ఉండగా నాలుగో వారం ఎండ్ లో కూడా ఇలాంటి హోల్డ్ ని చూపించడం విశేషం అనే చెప్పాలి. ఇక టోటల్ గా 27 రోజుల కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.