బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నాలుగో వీక్ ను కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) 28వ రోజున న్యూ ఇయర్ హాలిడే అడ్వాంటేజ్ తో మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఆల్ మోస్ట్ నిన్నటి మీద 60-70% రేంజ్ లో గ్రోత్ ని చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా మొత్తం మీద హిందీ లో మాత్రం రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ ఉంది. సినిమా మొత్తం మీద 28వ రోజున ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే…
ఓవరాల్ గా 1.4-1.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక, తమిళ్ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా లో సినిమా ఓవరాల్ గా 40-45 లక్షల రేంజ్ లో షేర్ ని సాధించవచ్చు. ఇక హిందీ లో ఆల్ మోస్ట్ 9 కోట్ల మార్క్ దాటేసి 10 కోట్ల మార్క్ ని టచ్ చేసే అవకాశం ఉంది…
ఓవర్సీస్ లో ట్రెండ్ కూడా బాగుండటంతో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 7.5-8 కోట్ల రేంజ్ లో షేర్ ని రాబట్టే అవకాశం ఉండగా ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది….ఓవరాల్ గా 28వ రోజున ఇండియన్ మూవీస్ పరంగా…
వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సినిమా సాధించే ఛాన్స్ ఎంతైనా ఉంది….మొత్తం మీద 4 వీక్స్ లో వరల్డ్ వైడ్ గా వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…ఇక టోటల్ గా సినిమా 4 వారాలకు గాను సాధించే అఫీషియల్ ఏరియాల వారి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.