రిలీజ్ అయిన రోజు నుండి ఎక్స్ లెంట్ రికార్డులతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) నాలుగో వారం ఎండింగ్ లో మరిన్ని రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోతూ మాస్ ఊచకోత కోస్తుంది ఇప్పుడు…
ఇండియన్ మూవీస్ లో 28వ రోజున న్యూ ఇయర్ అడ్వాంటేజ్ కలిసి రావడంతో అన్ని చోట్లా రెట్టించిన జోరు చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా ఈ రోజు వీర లెవల్ లో రాంపెజ్ ను చూపెడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ట్రాక్ చేసిన సెంటర్స్ లో మంచి గ్రోత్ ని చూపించిన సినిమా..
ఈ రోజు కోటి కి పైగా షేర్ ని మినిమమ్ వసూల్ చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోల హోల్డ్ ని బట్టి 1.2-1.4 కోట్ల రేంజ్ కి వెళ్ళొచ్చు…ఇక హిందీలో సినిమా హోల్డ్ మరో లెవల్ లో ఉండగా ప్రజెంట్ ఓపెనింగ్స్ ను చూస్తూ ఉంటేనే హిందీ లో…
28వ రోజున ఓవరాల్ గా 8-8.5 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు, ఈవినింగ్ అండ్ నైట్ షోల గ్రోత్ ని బట్టి ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..
తమిళ్ అండ్ కర్ణాటకలో కొంచం డౌన్ అయినా ఓవర్సీస్ లో పర్వాలేదు అనిపిస్తున్న సినిమా 28వ రోజున ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే ఓవరాల్ గా 6-6.5 కోట్ల రేంజ్ లో షేర్ దిశగా వెళుతుంది. నైట్ షోలకు కుమ్మితే ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక డే 28 ఎండ్ టైంకి ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.