బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ ఏవి కూడా పెద్దగా ఆడియన్స్ ను మెప్పించలేక పోయాయి. తేజ డైరెక్షన్ లో దగ్గుబాటి అభిరాం హీరోగా నటించిన అహింస సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ పోస్ట్ పోన్ అవుతూ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి మొదటి షోకే భారీగా మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకోగా….
కలెక్షన్స్ పరంగా కూడా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేక పోయింది. సినిమా రిలీజ్ అవ్వడం ఆల్ మోస్ట్ 200 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా తొలిరోజు అతి కష్టం మీద 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా రెండో రోజు మొత్తం మీద 15 లక్షల రేంజ్ లో..
గ్రాస్ ను సొంతం చేసుకుంది సినిమా. దాంతో 2 రోజుల్లో సినిమా టోటల్ గా 50 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా వర్త్ షేర్ అటూ ఇటూగా 22 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా… సినిమాను మొత్తం మీద 4 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించినట్లు అంచనా…
బాక్స్ ఆఫీస్ వాల్యూ బిజినెస్ అటూ ఇటూగా 2 కోట్ల దాక ఉంటుందని అంచనా….ఆ లెక్కన సినిమా కలెక్షన్స్ టార్గెట్ లో సగం కూడా అందుకునే అవకాశం లేదనే చెప్పాలి. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో అయినా ఏమైనా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో లేదో చూడాలి.