బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన స్ట్రైట్ తెలుగు సినిమా అయిన అల్లరి నరేష్(Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ బచ్చల మల్లి(Bachhala Malli Movie) సినిమా కి ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా కలెక్షన్స్ పరంగా సినిమా మొదటి రోజున మరీ అనుకున్న రేంజ్ లో…
జోరు అయితే చూపించ లేక పోయింది. ఓవరాల్ గా మొదటి రోజున 5.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను అందుకుని 60 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెండో రోజుకి వచ్చే సరికి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వేల రేంజ్ లోనే టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…
ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పర్వాలేదు అనిపించేలా ఉండగా రెండో రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా 1.10 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 1.15 కోట్ల రేంజ్ లో..
గ్రాస్ ను ఇప్పుడు సొంతం చేసుకోగా ఓవరాల్ గా రెండు రోజుల వరల్డ్ వైడ్ షేర్ అటూ ఇటూగా 60 లక్షల లోపు ఉంటుదని అంచనా…ఓవరాల్ గా సినిమా 2 రోజుల్లో మాస్ సెంటర్స్ లో కొంచం పర్వాలేదు అనిపించినా కూడా ఓవరాల్ గా మాత్రం వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్…
5.50 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే మాత్రం ఇంకా జోరు సాలిడ్ గా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఆదివారం రోజున అయినా సినిమా అంచనాలను మించి జోరు చూపిస్తుందో లేక ఇదే రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.