Home న్యూస్ డే 2 అల్లకల్లోలం చేసిన చిన్న సినిమా….అంచనాలను మించిన వసూళ్లు!!

డే 2 అల్లకల్లోలం చేసిన చిన్న సినిమా….అంచనాలను మించిన వసూళ్లు!!

0
Committee Kurrollu 2 Days Collections
Committee Kurrollu 2 Days Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన చిన్న సినిమా కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 2 Days Collections)మూవీ అంచనాలను మించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండగా మొదటి రోజు మొత్తం మీద 16 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు కి వచ్చే సరికి టికెట్ సేల్స్ పరంగా…

అంచనాలను మించి జోరు చూపించి ఏకంగా 30 వేల దాకా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని డబుల్ అనిపించే రేంజ్ లో మాస్ రచ్చ చేసింది ఇప్పుడు.  ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో సాలిడ్ ట్రెండ్ ను చూపించినా కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కొంచం డ్రాప్స్ ఉండగా ఓవరాల్ గా సినిమా రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 1.8 కోట్ల రేంజ్ లో…

గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 1 కోటికి పైగా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది….ఇక వరల్డ్ వైడ్ గా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా 1.10 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రిమార్కబుల్ హోల్డ్ ని చూపించి రచ్చ చేసింది…మొత్తం మీద 2 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…

కమిటీ కుర్రోళ్ళు సినిమా 1.75 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.95 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది…వరల్డ్ వైడ్ గా గ్రాస్ లెక్క 3.60 కోట్లకు పైగా ఉండగా ఓవరాల్ గా ఓ చిన్న సినిమా కి కొత్త పాత సినిమాల నుండి పోటిలో కూడా ఇలాంటి కలెక్షన్స్ సొంతం అవ్వడం విశేషం.

ఓవరాల్ గా సినిమా వాల్యూ టార్గెట్ రేంజ్ 3 కోట్ల దాకా ఉండగా రెండు రోజుల్లోనే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకువచ్చిన సినిమా ఇప్పుడు సండే అడ్వాంటేజ్ తో మరింత రచ్చ చేసే అవకాశం ఉండగా లాంగ్ రన్ లో మంచి లాభాలను కూడా దక్కించుకునే అవకాశం ఉంది. ఇక టోటల్ గా వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here