Home న్యూస్ 2 డేస్ 70 కోట్ల మాస్ జాతర….చుక్కలు చూయిస్తున్న నట సింహం!!

2 డేస్ 70 కోట్ల మాస్ జాతర….చుక్కలు చూయిస్తున్న నట సింహం!!

0

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసిన నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 36.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా 51.85 కోట్ల తో దుమ్ము లేపింది…

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు ఎక్స్ లెంట్ టికెట్ సేల్స్ తో అన్ని చోట్లా మాస్ రాంపెజ్ ను చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర సీడెడ్ లలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపించిన సినిమా నైజాంలో కూడా మంచి ట్రెండ్ తో దుమ్ము లేపింది ఇప్పుడు. దాంతో సినిమా రెండో రోజు…..

తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా ఇప్పుడు 15 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే ఈ లెక్క 16 కోట్ల రేంజ్ కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా 1.5 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా…

ఓవర్సీస్ లో కూడా కుమ్మేస్తూ దూసుకు పోతున్న సినిమా వరల్డ్ వైడ్ గా 2వ రోజున ఇప్పుడు 19-20 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం మించి పోయే ఔట్ రైట్ ఛాన్స్ కూడా ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఈ కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు ఓవరాల్ గా…

2 రోజుల్లో తెలుగు రాష్ట్రలలో 52 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 70 కోట్లకు పైగానే గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. రెండో రోజు ఓవరాల్ గా బాలయ్య కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకోబోతుంది. ఇక టోటల్ గా 2 రోజులలో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here